AI కెమెరా లో ఆన్.. 15 రోజుల్లో 18,778 ఉల్లంఘనలు నమోదు..!!

- January 10, 2025 , by Maagulf
AI కెమెరా లో ఆన్.. 15 రోజుల్లో 18,778 ఉల్లంఘనలు నమోదు..!!

కువైట్: కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన AI కెమెరాలు ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. డిసెంబర్ 2024లో 15 రోజులలో మొత్తం 18,778 ఉల్లంఘనలను క్యాప్చర్ చేశాయని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లోని ట్రాఫిక్ అవేర్‌నెస్ అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బు హసన్ తెలిపారు. వీటిలో 4,944 ఉల్లంఘనలు డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్‌ల వినియోగానికి సంబంధించినవి ఉన్నాయి.  2024లో ట్రాఫిక్ సంబంధిత మరణాలు తగ్గాయని, 2023లో 296తో పోలిస్తే 284 మరణాలు నమోదయ్యాయని, వాహనాలు, రోడ్లు, డ్రైవింగ్ లైసెన్సుల సంఖ్య పెరిగినప్పటికీ 12 కేసుల తగ్గుదల నమోదు అయిందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com