యూఏఈలో కొత్త పర్సనల్ చట్టం.. మైనర్‌లతో ప్రయాణిస్తే Dh100,000 ఫైన్..

- January 10, 2025 , by Maagulf
యూఏఈలో కొత్త పర్సనల్ చట్టం.. మైనర్‌లతో ప్రయాణిస్తే Dh100,000 ఫైన్..

యూఏఈ: యూఏఈలో న్యూ పర్సనల్ స్టేటస్ చట్టం ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించినవారికి Dh 100,000 వరకు జరిమానా చెల్లించాలి. మైనర్ పిల్లల సంరక్షకుడు లేదా కోర్టు అనుమతి లేకుండా పిల్లలతో ప్రయాణించే వారికి జరిమానాలు విధిస్తారు. దీంతోపాటు తల్లిదండ్రుల హక్కులను దుర్వినియోగం చేసే, నిర్లక్ష్యం చేసే లేదా పట్టించుకోని వ్యక్తులపై డిక్రీ జరిమానాలు విధిస్తుంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 15 నుండి అమలులోకి వస్తాయి.  మైనర్‌లు, వృద్ధ తల్లిదండ్రులను రక్షించడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించిన సంరక్షకులు జైలుశిక్ష, Dh100,000 వరకు జరిమానాలను విధిస్తారు.

ఇంకా, చట్టం ఆర్థిక దుష్ప్రవర్తనను కట్టడి చేయనుంది. మైనర్‌ల నిధులను అపహరించేవారు, దుబారా చేయడం లేదా చట్టవిరుద్ధంగా నిర్వహించే వారికి జరిమానా భారీ విధిస్తారు. చట్టం కుటుంబ విధులను తెలుపుతుంది. ఎవరైనా తల్లిదండ్రులను మోసం చేసినా, దాడి చేసినా, నిర్లక్ష్యం చేసినా లేదా తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించడానికి నిరాకరించించిన పక్షంలో జైలుశిక్షతోపాటు Dh5,000 మరియు Dh100,000 మధ్య జరిమానాలు విధిస్తారు. కోర్టు తీర్పు ద్వారా అవసరమైనప్పుడు వారి తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేసేవారు కూడా ఈ జరిమానాలను ఎదుర్కొంటారని వెల్లడించింది.

కొత్త చట్టంలో కుటుంబ వివాదాలను కేంద్రాల ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయమూర్తులకు విచక్షణాధికారాన్ని మంజూరు చేయడం, వివాహానికి చట్టపరమైన వయస్సు 18 ఏళ్లుగా నిర్ణయించడం వంటి ఇతర ముఖ్యమైన సవరణలు ఉన్నాయి. వీటితోపాటు చట్టం పిల్లల ఉత్తమ ప్రయోజనాలను కాపాడేందుకువారి వయస్సు 15 ఏళ్లు వచ్చిన తర్వాత ఏ తల్లిదండ్రులతో జీవించాలో ఎంచుకోవడానికి వారిని అనుమతిస్తుంది. మహిళలు తమకు నచ్చిన తగిన భాగస్వామిని వివాహం చేసుకునే హక్కును అనుమతిస్తుంది. ఈ మార్పు వివాహ ఒప్పందాలకు సంరక్షకుడు అవసరం లేని ముస్లిం నివాసితులకు సంరక్షకుల ఆమోదం అవసరాన్ని కూడా తొలగిస్తుంది. వివాహ ఒప్పందాలకు సంబంధించిన వ్యాజ్యాల మధ్యవర్తిత్వ వ్యవధిని 90 రోజుల నుండి 60 రోజులకు తగ్గిస్తుంది. కస్టడీ పరంగా, బాలురు / బాలికలు ఇద్దరికీ కస్టడీ ముగిసే వయస్సు 18 సంవత్సరాలకు పెంచారు.  చట్టం ముస్లిమేతర తల్లుల సంరక్షకులుగా ఉన్న హక్కులను పునఃపరిశీలిస్తుంది. బిడ్డకు ఐదు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ముస్లిమేతర తల్లి సంరక్షణ ముగియాలని నిర్దేశించిన మునుపటి చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com