ఖతార్ ఆర్థిక వృద్ధి..రికార్డు స్థాయికి ఖతార్ జిడిపి..!!

- January 11, 2025 , by Maagulf
ఖతార్ ఆర్థిక వృద్ధి..రికార్డు స్థాయికి ఖతార్ జిడిపి..!!

దోహా: భారీ ఎత్తున వస్తున్న పెట్టుబడులతో ఖతార్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది.  2025 చివరి నాటికి ఖతార్‌లో GDP $217.05bn (QR791.23bn)కు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ట్రేడింగ్ ఎకనామిక్స్‌లోని గ్లోబల్ మాక్రో మోడల్స్, విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా ఖతార్ టూరిజం హబ్ గా మారుతుంది. మౌలిక సదుపాయాల పరంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022, ఫార్ములా వన్, 2027లో జరగబోయే బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్, 2030 ఆసియా వంటి ఈవెంట్‌లు ఖతార్ స్థాయిని మరింత ఉన్నతికి తీసుకుపోనున్నాయి.

2025-2029 సంవత్సరాలకు సగటు ఆర్థిక జిడిపి వృద్ధి రేటు అంచనాలను అధికారులు వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరంలో వార్షిక వృద్ధి 2.4 శాతానికి పెరుగుతుందని, 2026కి అదనంగా 5.2 శాతానికి, 2027లో 7.9కి, 2028లో 3.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్పారు.  2029లో ఐదేళ్లలో సగటు 4.1 శాతంగా ఉన్నందున ఆర్థిక వృద్ధి 1.6 శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  ప్రపంచ మార్కెట్‌లో హైడ్రోకార్బన్‌ల అధిక ధర కారణంగా అధిక వృద్ధి రేట్లు ఉంటాయని మార్కెట్ రంగ నిపుణులు తెలిపారు. ఖతార్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటని చెబుతున్నారు. అయితే, ఖతార్ గ్యాస్ ఎగుమతులు పెరుగుతూనే ఉండగా, ఈ ధరలు సహేతుకంగా స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, GDP పెరుగుదలలో ఎక్కువ భాగం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) అమ్మకాల పెరుగుదల నుండి వస్తుంది. ఖతార్ ప్రభుత్వం ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్స్, టూరిజం, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, టెక్నాలజీతో సహా వివిధ రంగాలలో ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తుందని, ఇది GDP వృద్ధికి భారీగా దోహదపడుతుందని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com