జహ్రా, అహ్మదీలలో ముబారకియా మోడల్ హెరిటేజ్ మార్కెట్..!!
- January 12, 2025
కువైట్: ముబారకియా వంటి వారసత్వ మార్కెట్‌ను భవిష్యత్తులో జహ్రా, అహ్మదీ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఉప ప్రధాని, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్ యూసెఫ్ తెలిపారు. అల్ జహ్రాలోని రెడ్ ప్యాలెస్ - చారిత్రక ప్రదేశం సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. "కువైట్‌ను సందర్శించే వారిలో ఎక్కువ మంది ముబారకియా మార్కెట్‌కు వెళతారు." అని మంత్రి తెలిపారు. జహ్రా, అహ్మదీ ప్రాంతంలో ముబారకియాను స్థాపించాలని హిస్ హైనెస్ అమీర్ ప్రభుత్వాన్ని కోరారు.
ముబారకియా పాత మార్కెట్ ఒక చారిత్రాత్మక, సిద్ధ సాంప్రదాయ మార్కెట్ గా గుర్తింపు పొందింది. ఇది 200 సంవత్సరాలకు పైగా కువైట్ వాణిజ్యానికి మూలస్తంభంగా ఉంది. ఇది దేశంలోని పురాతన సౌక్‌లలో ఒకటిగా కువైట్ సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. చమురును కనుగొనడానికి చాలా కాలం ముందు వాణిజ్య కేంద్రంగా పనిచేసింది. ముబారకియా ఓల్డ్ మార్కెట్‌ను సందర్శించే వారు, గంటల తరబడి వాటిల్లోని సన్నని సందుల్లో మార్కెట్ ను చూడవచ్చు. అనేక వారసత్వ వస్తువులను అక్కడ అమ్ముతారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







