చెన్నమనేని స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

- January 12, 2025 , by Maagulf
చెన్నమనేని స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ‘ఉనిక’ పేరుతో చెన్నమనేని విద్యాసాగర్ రావు స్వీయ చరిత్ర పుస్తకాన్ని హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న వారు.. విద్యాసాగర్ రావు గొప్ప వ్యక్తి కొనియాడారు. విద్యాసాగర్ రావు సమర్థతను మోడీ గుర్తించి గవర్నర్ చేశారని తెలిపారు. విధానాల్లో వ్యతిరేకిస్తుండవచ్చు. వారు తెలంగాణ సమాజానికే ఆదర్శంగా నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో జైపాల్ రెడ్డి, కేశవరావు, విద్యాసాగర్ రావు రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచారు.తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే క్రీయాశీలకమైన వ్యక్తులను వైస్ ఛాన్స్ లర్ లను నియమించినట్టు తెలిపారు.

సమాజంలో ఏదైనా సమస్యలుంటే ప్రజలు విద్యార్థి పోరాటం ద్వారానే మన యూనివర్సిటీల చైతన్యం అన్నారు. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, విద్యా సాగర్ రావు నిలదీయడంలో ముఖ్యమైన వారు. పాలక పక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com