సహజ వనరుల కార్పొరేట్ పన్ను.. బిల్లుకు షార్జా ఆమోదం..!!
- January 13, 2025
యూఏఈ: షార్జా కన్సల్టేటివ్ కౌన్సిల్ (SCC) నాన్-ఎక్స్ట్రాక్టివ్ సహజ వనరుల కార్పొరేట్ పన్నుపై బిల్లును ఆమోదించింది. యూఏఈలో ఈ రకమైన మొదటి చట్టం ఇదే కావడం గమనార్హం. ఖనిజాల వెలికితీత, ఇతర సంబంధిత కార్యకలాపాలతో సహా ఈ రంగంలో పనిచేసే సంస్థలపై పన్ను విధించడాన్ని నియంత్రించడం ముసాయిదా చట్టం లక్ష్యమని షార్జా ఆర్థిక శాఖ డైరెక్టర్ షేక్ రషీద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి తెలిపారు. షార్జాలో పన్నుల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, సమర్థవంతమైన పాలన, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా విస్తృత ప్రయత్నంలో భాగమే ఈ ముసాయిదా చట్టం అని వివరించారు.సహజ వనరులకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను నియంత్రించే సమగ్ర శాసన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుందన్నారు. పదకొండవ శాసనసభ పదవీకాలపు రెండవ సాధారణ సెషన్లో భాగంగా షార్జాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ ఏడవ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బెల్హైఫ్ అల్ నుయిమి అధ్యక్షత వహించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







