ఎయిర్ అరేబియాలో 10 కిలోల హ్యాండ్ లగేజీకి అనుమతి..!!

- January 13, 2025 , by Maagulf
ఎయిర్ అరేబియాలో 10 కిలోల హ్యాండ్ లగేజీకి అనుమతి..!!

యూఏఈ: ప్రయాణికులకు ఎయిర్ అరేబియా 10 కిలోల వరకు ఉచిత హ్యాండ్ లగేజీకి అనుమతి ఇచ్చింది.  క్యారీ-ఆన్ బ్యాగేజీ ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్‌లో పట్టేదిగా ఉండాలని ఎయిర్‌లైన్ తెలిపింది.  హ్యాండ్‌బ్యాగ్ తర్వాత డ్యూటీ-ఫ్రీ బ్యాగ్ లేదా బ్యాక్‌ప్యాక్ అయిన రెండో బ్యాగ్ తప్పనిసరిగా ప్రయాణీకుడి ముందు సీటు కింద సరిపోవాలి.  అయితే, శిశువుతో ప్రయాణించే వారికి 3 కిలోలు అదనంగా అనుమతిస్తామని ఎయిర్ లైన్ తెలిపింది.

అదే సమయంలో ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్, ఎతిహాద్ ఎయిర్‌వేస్ వంటి ఇతర యూఏఈ బేస్డ్ ఎయిర్‌లైన్‌లు ప్రయాణీకులను 7 కిలోలకు మించని ఒక హ్యాండ్‌బ్యాగ్‌ను మాత్రమే అనుమతిస్తున్నాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com