'గో-ఎయిర్' వారి గొప్ప ఆఫర్లు
- June 29, 2016
విమాయాన సంస్థల ఆఫర్ల వరద కురుస్తోంది. వరుసగా వర్షాకాల బొనాంజా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ గో ఎయిర్ రానున్న సీజన్ ను దృష్టిలో పెట్టుకుని బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. తక్కువ ధరకే విమాన టిక్కెట్లను ఆఫర్ చేసి విమాన ప్రయాణీకులను ఊరిస్తోంది. పరిమిత కాలానికి రూ.849 నుంచి ప్రారంభమయ్యే ధరలను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద జూన్ 29 నుంచి జూలై 2వ తేదీ మధ్యలో టికెట్స్ బుక్ చేసుకోవాలి.
ఇలా బుక్ చేసుకున్నవారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే ఈ స్కీం కింద బుక్ చేసుకున్న టికెట్లను రద్దుచేసుకునే అవకాశం లేదని గో ఎయిర్ వెల్లడించింది. దీంతోపాటుగ పేటీఎం ద్వారా ఈ చెల్లింపులు చేస్తే...10 శాతం క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తోంది. అలాగే ప్రీ మీల్స్ బుకింగ్ కింద 60 శాతం తగ్గింపు, 200 రూపాయలు విలువచేసే కేఫ్ కాఫీడే వోచర్ ఆఫర్ ను కూడా అందిస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!







