అన్నపూర్ణ స్టూడియోస్ కు 50 ఏళ్ళు..నాన్న ఎంతో మందికి స్ఫూర్తి: నాగార్జున
- January 16, 2025
''రోడ్లే లేని రోజుల్లో నాన్న ఇక్కడికివచ్చి ఇంతపెద్ద అన్నపూర్ణ స్టూడియోస్ ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు.కానీ ఒక్కటి మాత్రం తెలుసు.అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది టెక్నిషియన్స్, కొత్త ఆర్టిస్ట్ లు, కొత్త డైరెక్టర్స్ కు ఉపాధి కల్పించింది. ఎంతో మందికి ఏయన్నార్ స్ఫూర్తి' అన్నారు కింగ్ అక్కినేని నాగార్జున.అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు అయిన సందర్భంగా కింగ్ అక్కినేని నాగార్జున ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
ఈ ప్రత్యేక వీడియోలో కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ..అన్నపూర్ణ స్టూడియోస్ కి 50వ ఏడు మొదలైయింది. నాన్న గారు ప్రతి సక్సెస్ ఫుల్ మ్యాన్ వెనుక ఒక విమెన్ ఉంటుందని నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనుక మా అమ్మగారు వున్నారని ఆయన బిలిఫ్. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్న ఇక్కడే వున్నారనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ప్లేస్ వారి ఫేవరేట్ ప్లేస్.
అన్నపూర్ణ స్టాఫ్ ని మేము ఫ్యామిలీగా భావిస్తాం. ఇవాళ స్టూడియో కళకళలాడుతుందంటే అది అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే. వాళ్ళు అన్నపూర్ణ వారియర్స్. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మ నాన్న అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ ట్రెడిషన్ ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతోంది.
లైఫ్ లో నాకు, మా పిల్లలకు, నాన్న పెద్ద ఇన్స్పిరేషన్.మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు బయట చాలా మందిని కలసినప్పుడు నాన్న గురించి ఎంతో పాజిటివ్ గా మాట్లాడతారు.ఆయన లైఫ్ పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ వుంటారు.ఏయన్నార్ లివ్స్ ఆన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు' తెలియజేశారు నాగార్జున.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







