విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం శుభవార్త..
- January 16, 2025
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. 11వేల 500 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్వహణను కొనసాగించనున్నారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా, నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కోంటోంది. దీన్ని అధిగమించేందుకు స్పెషల్ ప్యాకేజీ అందించాలని నిర్ణయించుకుంది సెంట్రల్ క్యాబినెట్.
విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీ అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి..
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించారు. అయితే, ఆర్థిక ప్యాకేజీపై శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కలిసినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీ అందించాలని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సిద్ధమైన కేంద్రం..
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. అయితే, నష్టాల్లో ఉన్న సంస్థను పరిరక్షించేందుకు, దాన్ని ముందుకు నడిపేందుకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సంస్థకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం భేటీ జరిగింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







