WPL షెడ్యూల్ రిలీజ్..
- January 17, 2025
ఐపీఎల్ కంటే ముందే క్రికెట్ లవర్స్‌కు వినోదం పంచేందుకు డబ్ల్యూపీఎల్ (Women's Premier League) సిద్ధం కానుంది. 2025 మహిళల ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్ రిలీజైంది. ఫిబ్రవరి 14న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్‌తో ఢీ కొట్టనుంది.
ఈ టోర్నీకి నాలుగు నగరాలు వేదిక కానున్నాయి. ముంబయి, బెంగళూరు, వడోదర, లఖ్‌నవూ స్టేడియాల్లో మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. అత్యధికంగా బెంగళూరు 8 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముంబయి వేదిక కానుంది. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.
కాగా, ఫిబ్రవరి 14న మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్‌కు సంబంధించిన సెలబ్రిటీలు ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొని సందడి చేయనున్నారు. టైటిల్ కోసం మొత్తం 5 జట్లు టోర్నమెంట్లో పోటీపడనున్నాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







