సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్‌కి NATS విరాళం

- January 17, 2025 , by Maagulf
సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్‌కి NATS విరాళం

ఫిలడెల్ఫియా: భాషే రమ్యం..సేవే గమ్య అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన సేవా భావాన్ని మరోసారి చాటింది. ఫిలడెల్ఫియాలో నాట్స్ విభాగం స్థానిక సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్‌కి ఆరు వేల డాలర్లను విరాళంగా అందించింది. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఈ చెక్కును సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్ ప్రిన్సిపల్ జాసన్ హెచ్ బుచర్‌కు అందించారు. నాట్స్ అందించిన విరాళం ద్వారా సెంట్రల్ బక్స్ సౌత్‌లో కార్యకలాపాలను మరింత ముమ్మరంగా చేయనుంది.నాట్స్ పూర్వ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, నాట్స్ బోర్డు సభ్యుడు వెంకట్,  నాట్స్ జాతీయ కార్యక్రమాల సమన్వయకర్త రమణ రకోతు, నాట్స్ యూత్ సభ్యురాలు అమృత శాఖమూరి ఈ విరాళాన్ని అందించిన వారిలో ఉన్నారు. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం చేసిన దాతృత్వం  సమాజంలో సేవా స్ఫూర్తిని నింపుతుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. నాట్స్ ఫిలడెల్ఫియా సభ్యులను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com