ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

- January 17, 2025 , by Maagulf
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో.. తల్లికి వందనం పథకం అమలు విషయంపై సీరియస్ డిస్కషన్ నడిచింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు వేసిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయించారు. ఇక పోలవరం డయాఫ్రామ్ వాల్‌ను వెంటనే ప్రారంభించామని నిర్ణయించారు. రాధాజాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభమవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్ భేటీలో చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం పేదలకు ఇచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఏపీ కేబినెట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలివే..

  • ఫ్రీ హోల్డ్ లాండ్స్‌పై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ.
  • 12 లక్షల ఎకరాలు విడుదలపై చర్చించారు.
  • ఇన్‌చార్జి మంత్రులను జిల్లాల వారీగా మీటింగ్ పెట్టి, సమీక్ష చేసి, వచ్చే కేబినెట్ సమావేశానికి నివేదికలు తీసుకురావాలని నిర్ణయించారు.
  • GSD వృద్ధి సాధించేందుకు కొన్ని రంగాలను లక్ష్యం చేసుకోవాలని సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
  • బడ్జెట్ సమావేశాలకు ముందు కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • ఇళ్ల స్థలాలకు పట్టణాల్లో స్థలం లేకపోతే TIDCO ఇల్లు ఇవ్వాలని నిర్ణయం.
  • ఇన్‌చార్జి మంత్రులు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి స్థలాలు సేకరణపై నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశాలు.
  • అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు నిధులు ఇవ్వడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన కేబినెట్.
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు నిధులు ఇచ్చినా భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్ కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని భావించిన కేబినెట్.
  • విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే సెంటీమెంట్ ఉందని, అందుకు అనుగుణంగా ప్లాంట్‌ను నడపాలని భావించిన కేబినెట్.
  • ఫ్రీ హోల్డ్‌లో ఉన్న 15 లక్షల 35 వేల ఎకరాల్లో 25 వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని మంత్రి మనోహర్ చెప్పారు.
  • రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహాయం చేస్తుందని అందువలన.. మనం కూడా కేంద్రానికి అదేవిధంగా సహాయం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు.
  • శనివారం సాయంత్రం కేంద్ర హోమంత్రి అమిత్ షా వస్తున్నారని, ఆయనతో డిన్నర్ మీట్‌లో మూడు పార్టీల నేతలు కలుస్తారని సీఎం చెప్పారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com