ప్రపంచ పెట్టుబడుల మ్యాచ్‌లో ఏపీని చేర్చడానికి సిద్ధం: సీఎం చంద్రబాబు
- January 19, 2025
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన నిమిత్తం దావోస్ బయల్దేరారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రేపు ప్రారంభం కానుంది.మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన బృందం పాల్గొననున్నారు.
ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం…రాత్రి 1.30 గంటలకు జ్యూరిచ్ వెళ్లనుంది.
కాగా, రేపు ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం బృందం హాజరుకానుంది.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు…
‘‘ప్రపంచ పెట్టుబడుల మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ చేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. నేను స్విట్జర్లాండ్‌లోని దావోస్-క్లోస్టర్స్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సమావేశానికి GoAP నుండి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- సీఐఐ అవార్డ్స్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎనిమిదోసారి ‘ఎనర్జీ లీడర్’ గౌరవం
- చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్..
- ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!







