జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- January 20, 2025
జ్యూరిచ్: రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తమతమ బృందాలతో దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వీరు పాల్గొంటారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదతరులు ఏపీ నుంచి దావోస్ పర్యటనకు బయలుదేరగా.. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు సోమవారం జ్యూరిచ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో చంద్రబాబు నాయుడు బృందానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం తారసపడింది. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా పలుకరించుకున్నారు. మంత్రుల బృందంతో ఎయిర్ పోర్టులో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోను టీటీడీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







