ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మృతి
- January 20, 2025
చెన్నై: టాలీవుడ్‌లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు విజయ రంగరాజు మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రంగస్థల కళాకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రంగరాజు, తన ప్రతిభతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డ ఆయన, చికిత్స కోసం చెన్నై వెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. విజయ రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.రంగస్థల నటుడిగా రాణించిన రంగరాజు, బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేశారు. కానీ, ఆయనకు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన భైరవ ద్వీపం. ఈ సినిమాలో ఆయన ప్రతినాయక పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఇక యజ్ఞం చిత్రం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఇందులో ప్రతినాయకుడిగా అదరగొట్టిన రంగరాజు, ఆ తర్వాత వరుస చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు.
విజయ రంగరాజు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ గుర్తింపు పొందారు. ప్రతినాయకుడిగా, సహాయ పాత్రలలో తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో నైపుణ్యం కలిగిన రంగరాజు, తన శారీరక దారుఢ్యాన్ని పాత్రలకు అనుగుణంగా ఉపయోగించుకుని మరింత ప్రత్యేకతను చాటుకున్నారు.విజయ రంగరాజు మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ప్రతిభ, నటన, వ్యక్తిత్వం తరం తరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. సినీ అభిమానులు, సహ నటులు సోషల్ మీడియాలో ఆయన మరణం పై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







