తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- January 21, 2025
కెనడా: తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ‘తీన్మార్ సంక్రాంతి’గా మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికోలో ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి ప్రారంభించగా, గుప్తేశ్వరి వాసుపిల్లి గారు,పద్మజ వరదా, సమత కాకర్ల, కస్తూరి ఛటర్జీ మరియు మాధురి చాతరాజు జ్యోతి ప్రజ్వలన చేయగా, శ్రీతన్ పూల మరియు ఆర్యన్ పూల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.
ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, ముగ్గులు మరియు వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి గారు పర్యవేక్షించారు.
కార్యక్రమంలో భాగంగా వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ NCPL అధినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి గారిచే 2025 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు.శ్రీనివాస్ మన్నెం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో’ అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.
తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి,రాహుల్ బాలనేని గారు మరియు మాధురి చాతరాజు నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు.ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్గా వ్యవహరించిన NCPL అధినేత రాంబాబు వాసుపిల్లిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు.
ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది.వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఫ్యాన్సీ డ్రెస్ బహుమతి స్పాన్సర్గా వ్యవహరించిన విభూతి ఫాబ్ స్టూడియో వారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది.ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి,సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి,కోటేశ్వర్ చెటిపెల్లి,శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రాహుల్ బాలనేని,పవన్ కుమార్ పెనుమచ్చ,రాము బుధారపు,మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల,కోటేశ్వర రావు చిత్తలూరి,అతిక్ పాషా, కలీముద్దీన్ మొహమ్మద్,అఖిలేష్ బెజ్జంకి,శ్రీనివాస తిరునగరి,సంతోష్ గజవాడ,వేణుగోపాల్ రోకండ్ల,ప్రభాకర్ కంబాలపల్లి,విజయ్ కుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







