కువైట్ ఆరోగ్య మంత్రిని కలిసిన ఇండియన్ డేంటిస్ట్ బృందం..!!
- January 21, 2025
కువైట్: కువైట్‌లోని ఇండియన్ డెంటిస్ట్స్ అలయన్స్ (IDAK) కార్యనిర్వాహక మండలి.. ఆరోగ్య మంత్రి, కువైట్, డా. అహ్మద్ అబ్దుల్వహాబ్ అల్ అవధిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలు, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై చర్చించారు. ఈ సమావేశానికి డెంటల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డా. అహ్మద్ అసద్ కూడా హాజరయ్యారు. ఇంకా IDAK అధ్యక్షుడు డా. జార్జ్ పి. అలెక్స్, ప్రధాన కార్యదర్శి డా. జిజన్ సామ్ థామస్, వైస్ ప్రెసిడెంట్ డా. రోషిలా, మాథ్యూ, సంయుక్త కార్యదర్శి అమృత గీవర్గీస్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ షాలిన్ అన్ సైమన్ పాల్గొన్నారు. డీకోడింగ్ డెంటల్ పెయిన్.. కేర్ టు క్యూర్ పేరుతో 9వ ఓరల్ హెల్త్ గైడ్‌ను విడుదల చేశారు. ఇండియన డెంటల్ అసోసియేషన్ వ్యక్తిగత జీవితాలను మెరుగుపరచడానికి IDAK అంకితభావంతో పనిచేస్తుందని అల్ అవధి ప్రశంసించారు. ఏప్రిల్ 25న 5వ IDAK ఇంటర్నేషనల్ సైంటిఫిక్ సింపోజియం ఫెలిసిటేషన్ సెర్మనీకి హాజరయ్యేందుకు IDAK ఆహ్వానాన్ని మంత్రి అంగీకరించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ అల్ హషేమీ బాల్రూమ్, హోటల్ రాడిసన్ బ్లూలో నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు







