సూరన్ పార్ట్ 2 మార్చి 27న గ్రాండ్ రిలీజ్
- January 22, 2025
చియాన్ విక్రమ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2 మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు,దుషార విజయన్ వంటి అద్భుతమైన నటులు ఉన్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.కె. ప్రసన్న ఎడిటింగ్ వర్క్ పర్యవేక్షిస్తున్నారు సి.ఎస్. బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్.
H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' ఒక యాక్షన్ థ్రిల్లర్, ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినందున, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింతపెరుగుతున్నాయి, ఇవన్నీ మిలియన్ల వ్యూస్ మైలురాయిని చేరుకున్నాయి. ఇప్పుడు, ఈ చిత్రం మార్చి 27, 2025న తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
చియాన్ విక్రమ్-దర్శకుడు S.U.అరుణ్ కుమార్-నిర్మాత రియా శిబుల అద్భుతమైన అద్భుతమైన కొలాబరేషన్ లో వస్తున్న వీర ధీర సూరన్ పార్ట్ 2 పై ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులలో చాలా అంచనాలు వున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







