బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- January 22, 2025
బిల్ గేట్స్‌తో CIYEM చంద్రబాబు భేటీ
దావోస్: దావోస్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో 3వ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎంతో భేటీ కానున్న వారిలో డీపీ వరల్డ్ గ్రూపు, యునీలీవర్, గూగుల్ క్లౌడ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులు ఉన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను ఆయా సంస్థల అధినేతలతో భేటీ అయి చంద్రబాబు వివరించనున్నారు.
పునరుత్పాదక విద్యుత్ పై ఫోకస్..
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ నేడు చంద్రబాబు చర్చలు జరుపుతారు. ఏపీకి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.దావోస్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌కోతో ఎంవోయూ కుదుర్చుకోనుంది. తద్వారా ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ పై ఫోకస్ చేస్తారు.పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







