జనవరి 26 నుండి ముంబై, అహ్మదాబాద్‌లకు ఎమిరేట్స్ A350 సర్వీసులు..!!
- January 24, 2025
యూఏఈ: రెండు పెద్ద భారతీయ నగరాలు ముంబై, అహ్మదాబాద్ లకు జనవరి 26 నుండి ఎమిరేట్స్ తన సరికొత్త A350 సర్వీసును ప్రారంభించనుంది. ఈ రెండు నగరాల చేరికతో ఎయిర్‌బస్ A350 ఇప్పుడు నెట్‌వర్క్‌లోని ఎడిన్బర్గ్, కువైట్, బహ్రెయిన్‌లతో సహా ఐదు గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది. ఈ విమానంలో ఎమిరేట్స్ తాజా ఇంటీరియర్స్ మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
ముంబై, అహ్మదాబాద్‌లకు ఎమిరేట్స్ A350 సేవలు ఈ క్రింది విధంగా పనిచేస్తాయి (అన్ని సమయాలు స్థానికంగా ఉంటాయి):
ముంబై: EK502, EK503 రోజువారీ విమానాలు
EK502 దుబాయ్ నుండి మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5.50 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో EK503 అనే విమానం ముంబైలో రాత్రి 7.20 గంటలకు బయలుదేరి రాత్రి 9.05 గంటలకు దుబాయ్ చేరుకుంటుంది.
అహ్మదాబాద్: EK538, EK539 రోజువారీ విమానాలు
EK538 రాత్రి 10.50 గంటలకు దుబాయ్‌లో బయలుదేరి, తెల్లవారుజామున 2.55 గంటలకు (మరుసటి రోజు) అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. EK539 అహ్మదాబాద్‌లో ఉదయం 4.25 గంటలకు బయలుదేరి తిరిగి 6.15 గంటలకు దుబాయ్ చేరుకుంటుంది.
ఎయిర్‌లైన్ ప్రస్తుతం ముంబై, బెంగళూరుకు దాని ఫ్లాగ్షిప్ A380 ఎయిర్‌క్రాఫ్ట్‌లో రోజువారీ సేవలను అందిస్తోంది. ప్రీమియం ఎకానమీతో సహా నాలుగు క్యాబిన్ తరగతుల ఎంపిక వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఎమిరేట్స్ భారతదేశంలో వారానికి 167 విమానాలతో తొమ్మిది పాయింట్లను అందిస్తోంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







