ఖతార్‌లో జంతువులు నమోదు తప్పనిసరి.. మూడేళ్ల జైలుశిక్ష..!!
- January 24, 2025
దోహా, ఖతార్: ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఖతార్‌లో మంత్రిత్వ శాఖలు ప్రమాదకరమైన జంతువులు, జీవుల సర్వే చేపట్టాయి. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ సర్వే.. చట్టం నెం. (10) ఆఫ్ 2019 ప్రమాదకరమైన జంతువులు, జీవులను నియంత్రించనుంది. సర్వే నేపథ్యంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ గుర్తించిన జంతువులు, జీవుల యజమానులు సంబంధిత ఫారమ్ ద్వారా నమోదు చేసుకోవాలని, [email protected]కి ఇమెయిల్ ద్వారా అప్లికేషన్లను సమర్పించాలని సూచించింది. రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 22గా పేర్కొంది. అధికారుల నుండి లైసెన్స్ లేని జంతువులు, జీవులను కలిగిఉండటం నేరంగా పరిగణించబడుతుందని, చట్టం ప్రకారం శిక్షార్హమని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. చట్టంలోని ఆర్టికల్ (8) ప్రకారం.. మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష, QR 100,000వరకు జరిమానాలు విధిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







