రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన విజయ్ సాయి రెడ్డి
- January 24, 2025
విశాఖపట్నం: రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇకపై వ్యవసాయమే తన భవిష్యత్తు కార్యాచరణగా ప్రకటించారు. ఇన్నాళ్ల తన రాజకీయా అనుభవాన్ని పక్కనపెట్టేసి కేవలం వ్యవసాయంపైనే తన దృష్టిని పెట్టబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. మొదటి నుంచి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నితుడిగా మెలిగిన విజయసాయి తాను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే సంకేతాలిచ్చారు.
ఇకపై రాజకీయాల్లో తాను కొనసాగబోనని వ్యవసాయం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తానని, ఇదే తన అంతిమ కర్తవ్యంగా విజయసాయి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ వేదికగా ప్రకటనలో తెలియజేశారు. రాబోయే రోజుల్లో తాను ఏ రాజకీయ పార్టీలో కొనసాగబోయేది లేదని, ఎలాంటి పదవులు, ప్రయోజనాల గురించి ఆలోచనే లేదన్నారు. డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని, తన నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని చెప్పారు.
విజయసాయి రెడ్డి ఊహించని ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయసాయి ఈ సంచలన నిర్ణయం వెనుక అసలు కారణాలేంటీ అనేది కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. 2028 వరకు రాజ్యసభ పదవి కాలం ఉండగా, ఇలాంటి నిర్ణయం వెనుక అసలు కారణాలేంటీ అన్నది ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయసాయి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీకి క్రమంగా బలం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది.
ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా మొదలై రాజ్యసభ ఎంపీ వరకు:
ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా కెరీర్ మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి.. వైసీపీలో ఎంపీగా కొనసాగుతూ వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్‌గా కూడా పనిచేశారు. అలా మొదలైన తన ప్రస్థానం వైసీపీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైసీపీ ఆవిర్భావం సమయంలో కూడా విజయసాయి వైఎస్ జగన్ వెన్నుంటే నడిచారు.
ఈ నేపథ్యంలోనే జగన్ విజయసాయికి రెండు సార్లు రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో కూడా నెల్లూరు ఉంచి ఎంపీగా విజయసాయి బరిలోకి దిగారు. కానీ, అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల సమయానికి వైసీపీలో 11మంది రాజ్యసభ సభ్యులు ఉండగా, ఇటీవలే వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభకు 3 రాజీనామా చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయనునన్నట్టు ప్రకటించారు.
- రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
- రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
- ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
- ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







