రాజధాని ప్రయాణికులకు ఎయిర్ఇండియా వినూత్న ఆఫర్
- June 30, 2016
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బెర్త్ కన్ఫమ్ కాలేదా? ఫీలవ్వకండి.. మీకు లిఫ్ట్ ఇవ్వడానికి ఎయిరిండియా ఉంది. తమ కొత్త స్కీమ్‌లో భాగంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ ఫస్ట్‌క్లాస్ టికెట్ కొన్నా బెర్త్ దక్కని ప్రయాణికులను ఎయిరిండియా వారి గమ్యస్థానాలకు చేరవేయనుంది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రాజధాని ప్రయాణికులు.. ఎయిరిండియా ఫ్లైట్ డిపార్చర్‌కు నాలుగు గంటల ముందు టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. రాజధాని ఏసీ ఫస్ట్‌క్లాస్ టికెట్ ధరలోనే ఫ్లైట్ టికెట్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ కొనసాగుతుంది. ప్రస్తుతం దేశంలో 21 రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజుకు 20 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిలో బెర్త్ దొరకని వారు మరిన్ని వేలమంది ఉంటారు. వారందరూ అదే టికెట్ ధరలో ఎంతో ముందుగానే గమ్యస్థానానికి చేరుకునే వీలు ఉంటుంది. ముంబై, చెన్నై వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్ల ధరలు వరుసగా 4755, 6335గా ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







