0.7 శాతం పెరిగిన ఒమన్ ద్రవ్యోల్బణం..!!
- January 26, 2025
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ (NCSI) జారీ చేసిన సుల్తానేట్‌లోని వినియోగదారుల ధరల సూచిక (CPI) నుండి వచ్చిన డేటా ప్రకారం.. ఒమన్ లో ద్రవ్యోల్బణం రేటు 2023 (ప్రాథమిక సంవత్సరం 2018) అదే నెలతో పోలిస్తే 2024 డిసెంబర్లో 0.7 శాతం పెరిగింది. వివిధ వ్యక్తిగత వస్తువులు, సేవల గ్రూప్ ధరలు 4.5 శాతం, ఆరోగ్య గ్రూప్ 3.2 శాతం, ఆహారం, మద్యపాన రహిత పానీయాల గ్రూప్ 1.7 శాతం, రెస్టారెంట్లు,హోటళ్ల గ్రూప్ 0.8, వినోద గ్రూప్ 0.6 శాతం, దుస్తులు, పాదరక్షల గ్రూప్ 0.5 శాతం, ఫర్నిచర్, గృహోపకరణాలు నిర్వహణ గ్రూప్ 0.4 శాతం, విద్యా గ్రూప్ రా 0.1 శాతం పెరుగుదలను డేటా సూచించింది. మరోవైపు, రవాణా గ్రూప్ ధరలు 0.8 శాతం తగ్గాయి.అయితే హౌసింగ్, నీరు, విద్యుత్, గ్యాస్, కమ్యూనికేషన్లు, పొగాకు, ఇతర ఇంధనాల గ్రూపుల ధరలు స్థిరంగా ఉన్నాయి.
కూరగాయల గ్రూపు ధరలు 7.6 శాతం పెరిగాయి. పాలు, చీజ్, గుడ్ల గ్రూప్ కూడా 3.8 శాతం పెరిగింది. ఆహార ఉత్పత్తుల గ్రూప్ 3.7 శాతం, చక్కెర, జామ్, తేనె , స్వీట్ల గ్రూప్ 2.8 శాతం, మాంసం గ్రూప్ 2.6 శాతం, పండ్ల గ్రూప్ 2.2 శాతం, నూనెలు, కొవ్వుల గ్రూప్ 1.6 శాతం పెరిగాయి. అదే సమయంలో ధాన్యాల గ్రూప్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే మద్యపాన రహిత పానీయాల గ్రూప్ ధరలు 0.5 శాతం తగ్గాయి. చేపలు, మత్స్య గ్రూప్ ధరలు కూడా 6.3 శాతం తగ్గాయి.
ముసందమ్ గవర్నరేట్ డిసెంబరు 2024 చివరి నాటికి గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే అత్యధిక ద్రవ్యోల్బణం 1.6 శాతంగా నమోదైంది. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో ద్రవ్యోల్బణం 1.5 శాతం, అల్ వుస్తా గవర్నరేట్‌లో 1.4 శాతం పెరిగింది. అల్ దహిరా గవర్నరేట్‌లో ద్రవ్యోల్బణం రేటు 0.9 శాతం, అల్ బురైమి, అల్ దఖిలియా, ధోఫర్ గవర్నరేట్లలో ఒక్కొక్కటి 0.8 శాతం పెరిగింది. ఇది నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లో 0.7 శాతం, మస్కట్ గవర్నరేట్‌లో 0.6 శాతం మరియు నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో 0.5 శాతం పెరిగింది. అయితే దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో ఇది 0.1 శాతం తగ్గింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







