2026 నుండి రెగ్యులర్ గా సౌదీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గ్లోబల్ మీటింగ్స్..!!

- January 26, 2025 , by Maagulf
2026 నుండి రెగ్యులర్ గా సౌదీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గ్లోబల్ మీటింగ్స్..!!

రియాద్: సౌదీ అరేబియాలో అత్యున్నత స్థాయి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) గ్లోబల్ మీటింగ్‌ను 2026లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సౌదీ అరేబియా ఆర్థిక, ప్రణాళికా మంత్రి ఫైసల్ అలీబ్రహీ, WEF ప్రెసిడెంట్‌తో కలిసి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ప్రకటించారు. 2026 సమ్మర్ లో సౌదీ అరేబియాకు ప్రపంచ సమాజాన్ని స్వాగతించడానికి మేము ఎదురుచూస్తున్నామని తెలిపారు. WEF ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే మాట్లాడుతూ..వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026లో సౌదీకి వచ్చేందుకు ఎదురుచూస్తోందనితెలిపారు. ఏప్రిల్ 2024లో రియాద్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రత్యేక సమావేశం విజయవంతనవ్వడంతో గ్లోబల్ స్థాయిలో సౌదీ అరేబియా సామర్థ్యం తెలిసిందన్నారు. కింగ్డమ్ వేదికగా జరిగే సమావేశం సమగ్ర ప్రపంచ వృద్ధిని నడపడానికి, WEF కమ్యూనిటీతో సంక్లిష్టమైన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com