2025లో QR750mకు ఖతార్ డేటా సెంటర్ మార్కెట్..!!
- January 28, 2025
దోహా, ఖతార్: ఖతార్ డేటా సెంటర్ మార్కెట్ ఆదాయం 2025లో $206.90m (QR753.32m)కి చేరుతుందని అంచనా వేస్తున్నారు. వార్షిక వృద్ధి రేటు 5.78 శాతం అని స్టాటిస్టా నివేదిక తెలిపింది. 2025లో అంచనా వేసిన మార్కెట్ పరిమాణం $131mకు ఖతార్ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ చేరుతుందని పేర్కొంది. ఇంటర్నెట్‌లో డేటా స్టోర్, ప్రాసెస్, షేరింగ్ కోసం క్లౌడ్-ఆధారిత పరిష్కారాల కోసం డిమాండ్ వేగంగా పెరుగుతుందని పెర్మియన్ చెయిన్ టెక్నాలజీ సీఈఓ మహమ్మద్ ఎల్ మస్త్రీ తెలిపారు.డేటా సెంటర్ మార్కెట్ దేశ GDPలో దాదాపు 0.10 శాతానికి చేరిందన్నారు. ఖతార్ కమ్యూనికేషన్ సర్వీసెస్ మార్కెట్‌లో ఆదాయం 2025లో $2.5bn (9.10bn) వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI), బ్లాక్‌చెయిన్, డిజిటల్ ప్రాపర్టీ, ఇతర అధునాతన టెక్నాలజీల వినియోగంకూడా వృద్ధికి దోహదం చేస్తుందని మస్త్రీ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ వృద్ధికి కీలకంగా ఉందని, ఇది మరింత పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ పెట్టుబడిదారులకు అవకాశాలను అందిస్తుందని విశ్లేషకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







