ఒమన్‌లో వేతన చెల్లింపుల కోసం న్యూ గైడ్ లైన్స్..!!

- January 28, 2025 , by Maagulf
ఒమన్‌లో వేతన చెల్లింపుల కోసం న్యూ గైడ్ లైన్స్..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని కార్మిక మంత్రిత్వ శాఖ వేతన రక్షణ వ్యవస్థ (డబ్ల్యుపిఎస్) ద్వారా వేతన చెల్లింపుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా,  ఉద్యోగులకు సకాలంలో ఖచ్చితమైన వేతన చెల్లింపులను సులభతరం చేస్తుందని తెలిపింది.

మార్గదర్శకాలలో ముఖ్య అంశాలు:
1. మంత్, ఇయర్ ఇండికేషన్: వేతనాలు చెల్లించిన నెల, సంవత్సరం ఫీల్డ్‌లు స్పష్టంగా పేర్కొనాలి.
2. సరైన ఉద్యోగి గుర్తింపు: ID రకాన్ని "సివిల్ నంబర్" లేదా బ్యాంక్ ఉపయోగించే అబ్రియేషన్ గా పేర్కొనాలి. ఒమానీ జాతీయుల గుర్తింపు కార్డుపై పౌర సంఖ్య లేదా ఒమానీయేతర నివాసితుల నివాస కార్డు నెంబర్ కచ్చితంగా ఉండాలి. పాస్‌పోర్ట్ నంబర్‌లను ఉపయోగించి నమోదు చేసే బ్యాంక్ ఖాతాల కోసం, ఐడెంటిఫైయర్ విలువ పాస్‌పోర్ట్ నంబర్‌తో "P" కోడ్‌ను ఉపయోగించాలి.
3. యజమాని గుర్తింపు: "యజమాని CR నంబర్" ఫీల్డ్ ఖచ్చితంగా యజమాని వాణిజ్య నమోదు సంఖ్యను నమోదు చేయాలి.
4. ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్‌: కార్మికులందరికీ చెల్లుబాటు అయ్యే ఉపాధి ఒప్పందం తప్పనిసరిగా ఉండాలి. బదిలీ చేయబడిన వేతనాలు ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఉండాలి. ఏదైనా అదనపు అలవెన్సులు, ఓవర్ టైం చెల్లింపు లేదా తగ్గింపులు నిర్దేశించిన ఫీల్డ్‌లలో ఖచ్చితంగా పేర్కొనాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com