గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించండి: రాహుల్ గాంధీ

- January 29, 2025 , by Maagulf
గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించండి: రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.ఈ ఘటన పట్ల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.గాయపడ్డ వాళ్లు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.వారికి మెరుగైన వైద్య సహయాన్ని అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు.నిర్వహణ లోపలే దీనికి కారణమని రాహుల్ గాంధీ, ఖర్గే వ్యాఖ్యానించారు. అమృత్ స్నాన్ చేయడానికి దేశం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు వస్తారని తెలిసి కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. సామాన్య భక్తుల కంటే వీఐపీల సేవలో అధికారులు తరించారని విమర్శించారు. మహా కుంభమేళా ముగియడానికి ఇంకా చాలా సమయం ఉందని, అమృత్ స్నాన ఘడియలు, తేదీలు ఇంకా ఉన్నాయని, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. వీఐపీ కల్చర్‌కు పుల్ స్టాప్ పెట్టాలని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.క్షతగాత్రులకు వీలైనంత సహాయం అందజేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

40 మందికి పైగా గాయపడ్డారు.వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది.సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు.సహాయక చర్యలు చేపట్టారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com