సౌదీలో సిగరెట్లు,వేప్‌లపై నిషేధం.. డ్రగ్ అథారిటీ క్లారిటీ..!!

- January 29, 2025 , by Maagulf
సౌదీలో సిగరెట్లు,వేప్‌లపై నిషేధం.. డ్రగ్ అథారిటీ క్లారిటీ..!!

రియాద్: సౌదీ అరేబియాలో సిగరేట్లు, ఎలక్ట్రానిక్ వేప్ ల అమ్మకాలను నిషేధించే ఆలోచన లేదని సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) సీఈఓ డా. హిషామ్ అల్-జాదే స్పష్టం చేశారు. పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, బెల్జియం వంటి దేశాలు వేపింగ్ ఉత్పత్తులపై నిషేధంతో సహా కఠినమైన చర్యలను అమలు చేస్తున్నాయి. రోటానా ఖలేజియా కార్యక్రమం "ఫై అల్-సౌరా"లో డా.అల్-జాదే మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ సిగరెట్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ నిబంధనలకు లోబడి ఉన్నాయని స్పష్టం చేశారు. సాంప్రదాయ ధూమపానానికి ఇ-సిగరెట్లు సురక్షితమైన ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. స్మోకింగ్ ను పూర్తిగా వదిలేయాలని, అలా వదిలేసేందుకు అవసరమైన సహాయం చేస్తామని అల్-జాదే వివరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com