యూఏఈలో ఫేక్ డిజైనర్ బ్యాగ్‌ స్కామ్‌..మోసపోయిన వేలాది మంది మహిళలు..!!

- January 29, 2025 , by Maagulf
యూఏఈలో ఫేక్ డిజైనర్ బ్యాగ్‌ స్కామ్‌..మోసపోయిన వేలాది మంది మహిళలు..!!

యూఏఈ: యూఏఈలో అనేక మంది మహిళలు యూరోపియన్ మహిళ నుండి నకిలీ డిజైనర్ బ్యాగ్‌లను కొనుగోలు చేసిన తర్వాత సోషల్ మీడియా స్కామ్‌కు గురయ్యారు. విక్రేత బ్యాగ్‌లను ప్రామాణికమైన, తగ్గింపు ఆఫర్లు అని తప్పుగా క్లెయిమ్ చేస్తూ..పరువురు మహిళలకు కుచ్చుటోపీ పెట్టారు.  దుబాయ్‌లో నివసిస్తున్న బొలీవియన్ ప్రవాస మారియా మాట్లాడుతూ.. 10వేల మంది సభ్యులతో ఫేస్‌బుక్ గ్రూప్‌లో విక్రేత నుండి ఒక పోస్ట్ రావడంతో తాను Dh2,000కి 'చానెల్' బ్యాగ్‌ని కొనుగోలు చేసినట్టు తెలిపింది. మార్కెట్లో ఇదే మోడల్‌ల అసలైన బ్యాగ్‌లు సాధారణంగా Dh9వేలు పలుకుతున్నాయి. అయితే, ఫేక్ డిజైనర్ వస్తువులను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు రావడం, విక్రయ సంస్థ గురించి ఆన్‌లైన్ లో జరుగుతున్న చర్చల తర్వాత అనుమానం కలిగిందని మరియా తెలిపింది. ఆమె తన బ్యాగ్‌ని వెరిఫికేషన్ కోసం అధీకృత చానెల్ స్టోర్‌కి తీసుకువెళ్లగా, అది నకిలీదని నిపుణులు నిర్ధారించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు, అప్‌డేట్ కోసం వేచి ఉన్నట్లు మారియా వివరించింది.  ఆగస్టు - డిసెంబర్ 2024 మధ్య 10 బ్యాగ్‌లను కొనుగోలు చేశానని, ఒక్కొక్కటి Dh1,500 , Dh2,000 చెల్లించినట్లు ఓ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ వెల్లడించారు. "నేను కొన్నింటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేసాను. కానీ ఒక బ్యాగ్ సరిగ్గా కనిపించనప్పుడు నాకు అనుమానం వచ్చింది. అధీకృత దుకాణాలను సందర్శించినప్పుడు అవన్నీ నకిలీవని నిర్ధారించారు." అని ఆమె చెప్పింది.  2,000 దిర్హామ్‌లకు కొనుగోలు చేసిన నకిలీ ‘డిజైనర్’ బ్యాగ్ మార్కెట్‌లో కేవలం 200 దిర్హామ్‌లకే విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు పలువురు మహిళలు తెలిపారు.  

దాదాపు 24వేల మంది సభ్యులతో స్టైల్ మీ దుబాయ్ వంటి ప్రీ-లగ్జరీ వస్తువులకు అంకితమైన ఫేస్ బుక్ గ్రూప్ సభ్యులు ఇదే తరహా అనుభవాలను నివేదించారు. అనేక మంది బాధితులు తమ కొనుగోలు చాట్‌ల స్క్రీన్‌షాట్‌లు, రసీదులు, నకిలీ హ్యాండ్‌బ్యాగ్‌ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  దుబాయ్ కస్టమ్స్ విభాగం 2023లో 333 మేధో సంపత్తి వివాదాలను నమోదు చేసింది.73.4 మిలియన్ దిర్హామ్ విలువైన 15 మిలియన్ నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకుంది. నివాసితులు అధికారిక దుకాణాలతో వస్తువుల ప్రామాణికతను ధృవీకరించాలని,  ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను అధికారులకు నివేదించాలని కోరారు. మోసపూరిత కార్యకలాపాల గురించి తెలిసినా చర్యలు తీసుకోవడంలో లేదా వాటిని నిరోధించడంలో విఫలమైన నిర్వాహకులకు ఆరు నెలల వరకు జైలు శిక్షతో పాటు Dh 2 మిలియన్ల వరకు జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com