2032లో భూమిని అస్టరాయిడ్ ఢీకొడుతుందా? ప్రమాద పరిధిలో ఇండియా?

- January 30, 2025 , by Maagulf
2032లో భూమిని అస్టరాయిడ్ ఢీకొడుతుందా? ప్రమాద పరిధిలో ఇండియా?

యూఏఈ: '2024 YR24' గ్రహశకలం(అస్టరాయిడ్) భూమిని ఢీకొనే అవకాశం ఎక్కువగా ఉందని అబుదాబికి చెందిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం (IAC) ప్రకటించింది. ఇది 2032లో భూమకి దగ్గరగా వెళుతున్న క్రమంలో ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. గత డిసెంబర్ 27న అట్లాస్ సిస్టమ్ టెలిస్కోపుల ద్వారా ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. దీని వ్యాసం 40 మీ- 100 మీ మధ్య ఉంటుందని అంచనా వేసినట్టు IAC డైరెక్టర్, ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ వార్నింగ్ నెట్‌వర్క్ సభ్యుడు మహ్మద్ షావ్కత్ ఒదేహ్ తెలిపారు.   

అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం (IAC) "2024 YR4" కోడ్‌తో కూడిన కొత్త గ్రహశకలాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది. గ్రహశకలం 2024 YR4 డిసెంబర్ 25న భూమికి 829,000కి.మీ దగ్గరకు వచ్చిందని, ఇది డిసెంబర్ 17, 2028న మళ్లీ భూమికి దగ్గరగా వస్తుందని, ఎలాంటి ముప్పును కలిగించకుండా దాటిపోతుందని భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 22, 2032న దాని మూడవ సారి మరింత దగ్గరగా వస్తుందని, అప్పుడు భూమికి ఢీకొట్టే ప్రమాదం ఉందని  ఓడెహ్ తెలిపారు. అయితే, 2028లో భూమికి దగ్గరగా వచ్చిన సమయంలో మరింత కచ్చితమైన సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు.

ఎక్కడ క్రాష్ అవుతుంది?
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గ్రహశకలం డిసెంబర్ 22, 2032న 106,000 కిలోమీటర్ల దూరంలో భూమికి దగ్గరగా వెళుతుంది.ఈ దూరం వద్ద ఇది పశ్చిమ మధ్య అమెరికా నుండి విస్తరించి ఉన్న ఇరుకైన స్ట్రిప్‌లో భూమితో ఢీకొని, ఉత్తర దక్షిణ అమెరికా, ఆపై మధ్య అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల గుండా ఇండియాకు చేరుకోవచ్చని నివేదిక పేర్కొంది. ప్రమాదం జరిగినప్పుడు నష్టం స్థానికంగా ఉంటుందని కూడా డేటా తెలిపింది. గ్రహశకలం వ్యాసం 1908లో సైబీరియాలో తుంగుస్కా సంఘటనకు కారణమైన గ్రహశకలం వలె ఉంటుందని, ఈ ప్రాంతంలో ఒక ఉల్క విస్ఫోటనం సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల అడవిని నాశనం చేసిందని. 80 మిలియన్లకు పైగా చెట్లు నామరూపాల్లేకుండా పోయాయని,  పేలుడు శక్తి 10-15 మెగా టన్నుల TNTకి సమానమైనదిగా ఉంటుందని అంచనా వేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com