యాన్బు వాటర్ ఫ్రంట్, టూరిజం ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన మదీనా ఎమిర్..!!

- January 30, 2025 , by Maagulf
యాన్బు వాటర్ ఫ్రంట్, టూరిజం ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన మదీనా ఎమిర్..!!

యాన్బు: మదీనా ఎమిర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్ యాన్బు ఇండస్ట్రియల్ సిటీలో వాటర్ ఫ్రంట్,  అనేక అభివృద్ధి వినోద ప్రాజెక్టులను ప్రారంభించారు. యాన్బు ఇండస్ట్రియల్ సిటీ వాటర్ ఫ్రంట్ 2.6లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సందర్శకుల కోసం బీచ్ సీటింగ్, రెస్టారెంట్లు,  కేఫ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులను జీవన నాణ్యత, పర్యాటకానికి మద్దతు ఇచ్చే లక్ష్యంతో అల్ ఒథైమ్ హోల్డింగ్ కంపెనీ అమలు చేస్తుంది.

ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్ SR400 మిలియన్ల పెట్టుబడితో అల్-ఒథైమ్ మెరీనా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ 200000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.  ఇందులో ఇంటిగ్రేటెడ్ కమర్షియల్ కాంప్లెక్స్, గ్లోబల్ హోటల్, ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్‌లు, రెస్టారెంట్లు, సినిమాస్ ఉన్నాయి. 575600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అల్-మహర్ ద్వీపాన్ని అభివృద్ధి చేయడానికి యాన్బులోని రాయల్ కమిషన్, అల్-ఓథైమ్ కంపెనీ ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో వాణిజ్య కేంద్రాలు, ఎంటర్ టైన్ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ సేవలు ఉన్నాయి.   

ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్ యాన్బు గవర్నరేట్‌లో మార్సా అల్ జార్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించారు. దీనిని 13000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ మెరైన్ అనుభవాన్ని అందించడానికి అల్-ఖరీఫ్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ రూపొందించింది. ఇక్కడ పడవలకు 100 పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. ఫిషింగ్, డైవింగ్, హైకింగ్ ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి.  మెరీనా "మార్సా అల్ జార్" అప్లికేషన్ ద్వారా ముందస్తుగా రిజర్వేషన్‌ చేసుకోవచ్చు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com