ఉమ్ సలాల్‌లో 17 ఏళ్ల యువకుడిపై సింహం దాడి..!!

- January 30, 2025 , by Maagulf
ఉమ్ సలాల్‌లో 17 ఏళ్ల యువకుడిపై సింహం దాడి..!!

దోహా, ఖతార్: ఉమ్ సలాల్‌లో 17 ఏళ్ల ఖతార్ యువకుడిపై ఓ సింహం దాడి చేసింది. ఈ దాడిలో యువకుడి తలకు, శరీరంలోని వివిధ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి... ఉమ్ సలాల్ ప్రాంతంలో ఈ సంఘటన రెండు వారాల క్రితం జరిగింది.  గాయపడిన యువకుడి తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు 2022లో సింహం పిల్లను (4 నెలల వయస్సు) తీసుకొచ్చాడని, అయితే దాని కారణంగా అతడు అలెర్జీలక గురయ్యాడు. దాంతో దానిని జంతు శిక్షణ నిపుణుడి సంరక్షణకు తరలించారు. అనంతరం ఆ యువకుడు సింహాన్ని 3 సార్లు సందర్శించాడు. కాగా, దాడికి దారితీసిన మూడవ సందర్శన జనవరి 12న జరిగింది. ఆ సమయంలో  తన కుమారుడిపై సింహం దాడి చేసిందన్నారు.  వెంటనే అప్రమత్తమైన సిబ్బంది యువకుడిని హమద్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.  తన కుమారుడిపై ఆడ సింహం దాడి చేసిందన్న పుకార్లను కొట్టిపారేసిన తల్లి, శిక్షకుడు పెంచిన సింహమే తన కుమారుడిపై దాడి చేసి గాయపరిచిందని, ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com