వింటర్ తహాయిమ్ సీజన్ 2025 ప్రారంభం..!!
- January 31, 2025
మస్కట్: "వింటర్ తహాయిమ్" సీజన్ రెండవ ఎడిషన్ జాలాన్ బని బు హసన్ విలాయత్‌లో ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. వినూత్న, ఆకర్షణీయమైన పద్ధతుల ద్వారా ఒమానీ వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.ఈ సంవత్సరం 'వింటర్ తహైమ్' సీజన్ సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ విశిష్ట వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని సౌత్ అల్ షర్కియా గవర్నర్ యాహ్యా బిన్ బదర్ అల్ మావలి అన్నారు.స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సాహించేందుకు, ఒమానీ SME, ఉత్పాదక కుటుంబాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.ప్రారంభ వేడుకలో లేజర్ లైటింగ్ షో, ఫైర్ వర్క్స్ అందరిని ఆకట్టుకున్నాయి.ఈ సీజన్లో సందర్శకుల కోసం "సాండ్ థియేటర్" కళాత్మక, సాంస్కృతిక, వారసత్వ ప్రదర్శనలు, ఎంటర్ టైన్ ప్రదర్శనలతోపాటు రెస్టారెంట్లు, కేఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. 2024లో నిర్వహించిన "వింటర్ తహైమ్" సీజన్ మొదటి ఎడిషన్ 300,000 మంది సందర్శకులను ఆకర్షించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష