ఏడేళ్ల బాలుడు మిస్సింగ్..గంటలోపే తల్లిదండ్రులకు అప్పగింత..!!

- February 01, 2025 , by Maagulf
ఏడేళ్ల బాలుడు మిస్సింగ్..గంటలోపే తల్లిదండ్రులకు అప్పగింత..!!

యూఏఈ: తప్పిపోయిన ఏడేళ్ల ఆసియా బాలుడిని గంటలోనే పోలీసులు వారి పేరెంట్స్ దగ్గరగా చేర్చారు. 7ఏళ్ల బాలుడు తప్పిపోగా, అజ్మాన్‌లోని ప్రధాన రహదారిపై ఒంటరిగా కనిపించాడు. వెంటనే పోలీసులు బాలుడిని తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదంతా గంటలోపే చకచకా జరిగిపోయింది.  మనామా ప్రాంతంలో ఒంటరిగా ఉన్న బాలుడిని ఓ అరబ్ వ్యక్తి గుర్తించి, అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడని మనామా పోలీస్ సెంటర్ హెడ్ అడ్వకేట్ ముహమ్మద్ రషీద్ అల్ మత్రౌషి తెలిపారు. ఆ సమయంలో తప్పిపోయిన పిల్లల గురించి తమవద్ద ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని, బాలుడి కుటుంబాన్ని గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసులు చిన్నారికి మధ్యాహ్న భోజనంతో పాటు కావాల్సినవన్నీ అందించారని పేర్కొన్నారు. నిమిషాల వ్యవధిలో అతని తల్లిదండ్రులను గుర్తించి సంప్రదించి, బాలుడిని అప్పగించినట్టు తెలిపారు. బాలుడిని గుర్తించడంలో సహాయంగా నిలిచిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయలో పోలీసుల చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.తమ పిల్లలపై ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలని పేరెంట్స్ కు అజ్మాన్ పోలీసులు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com