ఏడేళ్ల బాలుడు మిస్సింగ్..గంటలోపే తల్లిదండ్రులకు అప్పగింత..!!
- February 01, 2025
యూఏఈ: తప్పిపోయిన ఏడేళ్ల ఆసియా బాలుడిని గంటలోనే పోలీసులు వారి పేరెంట్స్ దగ్గరగా చేర్చారు. 7ఏళ్ల బాలుడు తప్పిపోగా, అజ్మాన్లోని ప్రధాన రహదారిపై ఒంటరిగా కనిపించాడు. వెంటనే పోలీసులు బాలుడిని తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదంతా గంటలోపే చకచకా జరిగిపోయింది. మనామా ప్రాంతంలో ఒంటరిగా ఉన్న బాలుడిని ఓ అరబ్ వ్యక్తి గుర్తించి, అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడని మనామా పోలీస్ సెంటర్ హెడ్ అడ్వకేట్ ముహమ్మద్ రషీద్ అల్ మత్రౌషి తెలిపారు. ఆ సమయంలో తప్పిపోయిన పిల్లల గురించి తమవద్ద ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని, బాలుడి కుటుంబాన్ని గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసులు చిన్నారికి మధ్యాహ్న భోజనంతో పాటు కావాల్సినవన్నీ అందించారని పేర్కొన్నారు. నిమిషాల వ్యవధిలో అతని తల్లిదండ్రులను గుర్తించి సంప్రదించి, బాలుడిని అప్పగించినట్టు తెలిపారు. బాలుడిని గుర్తించడంలో సహాయంగా నిలిచిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయలో పోలీసుల చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.తమ పిల్లలపై ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలని పేరెంట్స్ కు అజ్మాన్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







