మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం..

- February 01, 2025 , by Maagulf
మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం..

హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.వివిధ శాఖలకు అవసరమైన బడ్జెట్, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.అలాగే కేంద్ర బడ్జెట్ తో తెలంగాణకు కలిగే లాభనష్టాలపైనా అధ్యయనం చేసింది మంత్రివర్గం.వీటితో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు సమాలోచనలు చేశారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదనే భావన..
మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా సాగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఆరున్నర గంటల పాటు ఈ సమీక్ష సమావేశం జరిగింది.ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కలిగే ప్రయోజనమేంటి, నష్టమేంటి అన్నదానిపై..రంగాల వారీగా సుదీర్ఘంగా ఈ మీటింగ్ లో చర్చించారు.

రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సమాలోచనలు..
వివిధ శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలు, నిధుల సర్దుబాటుకు సంబంధించిన అంశాలపైన చర్చ జరిగింది.దీంతో పాటు త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.దీనికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన పైనా సమాలోచనలు మంత్రుల సమావేశం జరిగింది.కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదన్నది ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com