తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్
- February 01, 2025
హైదరాబాద్: తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ఈరోజు ఫిలిం ఛాంబర్ లో నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు మరియు ప్రముఖ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా క్యాంప్ ప్రారంభించడం జరిగింది.దిల్ రాజు మాట్లాడుతూ నిత్యం బిజీగా ఉండే ఫిలిం జర్నలిస్టులు ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ అవసరం కాబట్టి ఇలాంటి క్యాంపులు వల్ల మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయని చెప్పారు.ప్రముఖ హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ మా అందరితో సరదాగా ఉండే జర్నలిస్టులు ఎప్పుడు అదే విధంగా ఉండాలి అంటే దానికి హెల్త్ క్యాంపులు మరింత ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సి.ఓ.ఓ భాస్కర్ రెడ్డి తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో ఒక ఏం.ఓ.యు కుదుర్చుకున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







