యాన్బు స్టీమ్ టర్బైన్ యూనిట్‌లో ప్రమాదం..అనేకమంది కార్మికులు మృతి..!!
- February 03, 2025
రియాద్: యాన్బు ఇండస్ట్రియల్ సిటీలోని మరాఫిక్ కంపెనీకి చెందిన స్టీమ్ టర్బైన్ యూనిట్ బాయిలర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ దుర్ఘటనలో అనేకమంది కార్మికులు మరణించగా, పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ కథనం ప్రకారం..మరాఫిక్ కంపెనీ ఆవిరి టర్బైన్ యూనిట్‌లోని ఆరవ యూనిట్ బాయిలర్‌కు మద్దతు ఇచ్చే యూనిట్‌లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో వార్షిక పీరియాడిక్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం యూనిట్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు కంపెనీ తెలిపింది. మంటలు సకాలంలో పూర్తిగా అదుపులోకి వచ్చాయని,ఈ ప్రమాదంలో మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ నియమించిన అనేక మంది కార్మికులు మరణించారని తెలిపింది.కాగా, అగ్నిప్రమాదం వల్ల వినియోగదారులకు అందించే సేవలు ప్రభావితం కాలేదని పేర్కొంది.ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి సంబంధిత అధికారులతో కంపెనీ సమన్వయంతో పని చేస్తోందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







