బహ్రెయిన్ లో సైక్లిస్ట్‌ల కోసం 'హవా' ప్రాజెక్ట్‌ ప్రారంభం..!!

- February 03, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో సైక్లిస్ట్‌ల కోసం \'హవా\' ప్రాజెక్ట్‌ ప్రారంభం..!!

మనామా: బహ్రెయిన్ సైక్లిస్ట్‌ల కోసం "హవా" ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించింది. ఇది సైక్లిస్టుల కోసం గాలిని తాగునీరుగా మార్చి అందజేసే ఓ ప్రాజెక్ట్. , హిస్ మెజెస్టి ది కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి, సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ చైర్మన్ హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఈ మార్గదర్శక ప్రాజెక్ట్ హైడ్రేషన్ సొల్యూషన్స్‌లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. నాసర్ బిన్ హమద్ సైక్లింగ్ ట్రాక్ వెంట సైక్లిస్టులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన ఎయిర్-టు-వాటర్ టెక్నాలజీని ఉపయోగించి, హవా ప్రాజెక్ట్ లో గాలి నుండి తేమను సంగ్రహించి, దానిని స్వచ్ఛమైన, మినరల్-సుసంపన్నమైన తాగునీటిగా మారుస్తుంది. ఇది సైక్లిస్ట్‌లకు స్వచ్ఛమైన నీటిని అందజేస్తుంది.  ఇదంగా సోలార్ ఎనర్జీతో నడుస్తుందని పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com