సంక్లిష్టమైన కేసుల దర్యాప్తులో రాచకొండ ఐటీ సెల్ ముఖ్యపాత్ర : సీపీ సుధీర్ బాబు
- February 03, 2025
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ ఐటి సెల్ విభాగ అధికారులు మరియు సిబ్బందితో ఈరోజు కమిషనర్ సుధీర్ బాబు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఐటీ సెల్ యొక్క సోషల్ మీడియా, సిసిటిఎన్ఎస్, కోర్ టీమ్, సిఇఐఆర్, ప్రజావాణి ఫిర్యాదుల వంటి పలు విభాగాల పనితీరును, ఫలితాల ప్రగతిని కూలంకషంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో నమోదైన పలు ప్రాధాన్యమైన మరియు సంక్లిష్టమైన కేసుల దర్యాప్తులో రాచకొండ ఐటీ సెల్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నదని అభినందించారు.హత్య కేసులు, ప్రాపర్టీ నేరాలు, చైన్ స్నాచింగ్, వాహన దొంగతనాలు, మొబైల్ దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల వంటి పలు సంక్లిష్టమైన కేసులను త్వరితగతిన చేదించడంలో సాంకేతికపరమైన తోడ్పాటు అందిస్తూ ఐటీ సెల్ బృందం కృషి చేస్తోందని కమిషనర్ ప్రశంసించారు.రాచకొండ ఐటీ సెల్ యెుక్క సమర్థవంతమైన పనితీరు ద్వారా ఎన్నో సంక్లిష్టమైన నేరాల్లో సాంకేతికపరమైన సాక్ష్యాల సేకరణ ద్వారా అసలైన నిందితులను వీలైనంత తక్కువ సమయంలోనే పట్టుకోవడం సాధ్యమైందని, నేరస్తులకు ఖచ్చితమైన, కఠినమైన శిక్షలు పడడం జరుగుతోందని పేర్కొన్నారు.
కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, స్త్రీలు మరియు పిల్లల అపహరణ వంటి ఎన్నో కేసులలో బలమైన సాక్ష్యాధారాలను ప్రతీ ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు అందిస్తున్నాయని సీపీ ప్రశంసించారు. సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజల్లో మరింతగా ప్రచారం చేయాలని, ఇప్పటికే అమర్చిన కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్కు రాలేని మరియు అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితులు ఉపయోగించుకునే సోషల్ మీడియా విభాగం మరింత వేగంగా స్పందించాలని సూచించారు. నేర శాతాన్ని తగ్గించడానికి రాచకొండ పోలీసులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను సామాజిక మాధ్యమాల్లో మరింతగా ప్రచారం చేయాలని, కళాశాలల్లో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు తగ్గేలా ఎప్పటికప్పుడు వారితో సమన్వయం చేస్తూ పని చేయాలని, కేసుల దర్యాప్తులో వారికి అవసరమైన సహాయాన్ని వేగంగా అందించాలని సూచించారు.
కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణకు మరియు కేసుల వేగవంతమైన దర్యాప్తులో ఎంతో ముఖ్యమైన ఐటీ సెల్ విభాగాన్ని సాంకేతికపరంగా మరింత బలోపేతం చేయడానికి అవసరమైన తోడ్పాటు, మరియు సిబ్బందికి ప్రోత్సాహాన్ని తప్పక అందిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఐటీ సెల్ విభాగంలోని ప్రతి ఒక్కరూ మరింతగా తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపెరుచుకోవాలని, నూతన సాంకేతిక వనరులను ఉపయోగించుకుని కేసుల దర్యాప్తును సులభతరం చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్, ఐటీ సెల్ ఏసిపి నరేందర్ గౌడ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







