ఐఫోన్ ఎస్‌ఈ4 లాంచ్ కానుంది..
- February 03, 2025
ఐఫోన్ ఎస్‌ఈ4 వచ్చే నెల లేదా ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.ఆపిల్‌కు చెందిన ఈ ఫోర్త్ జనరేషన్ ఐఫోన్ ఎస్‌ఈ విడుదల గురించి ఆ సంస్థ అధికారికంగా ప్రకటనలు చేయనప్పటికీ కొన్ని నెలలుగా దీనిపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఐఫోన్ ఎస్‌ఈ4 పై ఎన్నో అంచనాలు వస్తున్నాయి. అంచనాలు నిజమైతే ఐఫోన్ ఎస్‌ఈ3లోని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లలో ఎంతో కీలకమైన అప్‌గ్రేడ్లతో ఇప్పుడు ఐఫోన్ ఎస్‌ఈ4 వస్తోంది.ఐఫోన్ ఎస్‌ఈ3ను ఆపిల్ కంపెనీ 2022లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
కొన్ని నెలల క్రితమే ఐఫోన్ 16 లాంచ్
ఆ సంస్థకు చెందిన డివైజులు అంటే అన్ని దేశాల్లో యమ క్రేజ్ ఉంటుంది.ఆపిల్ కొన్ని నెలల క్రితమే ఐఫోన్ 16ను లాంచ్ చేసింది. ఆ సంస్థ నుంచి తక్కువ ధరకు ఐఫోన్ ఎస్‌ఈ సిరీస్‌లు విడుదల చేస్తుంది. చాలా ఖర్చు చేసి ఐఫోన్‌లను కొనలేని వారు ఐఫోన్ ఎస్‌ఈ మోడళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
ఐఫోన్ ఎస్‌ఈ మోడళ్లు మొత్తం 3 వచ్చాయి. 2016, 2020, 2022లో ఐఫోన్ ఎస్‌ఈ మోడళ్లను ఆపిల్ విడదుల చేసింది. మళ్లీ ఇప్పుడు ఇప్పుడు ఫోర్త్ జనరేషన్‌ను (ఐఫోన్ ఎస్‌ఈ 4) విడుదల చేస్తోంది. దీన్ని రెండు నెలల్లో మార్కెట్లోకి విడుదల చేస్తుంది.
అద్భుతమైన ఫీచర్లు
ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న అంచనాల ప్రకారం.. ఐఫోన్ ఎస్‌ఈ4లో చోటుచేసుకుంటున్న ముఖ్యమైన మార్పుల్లో ఒకటి దాని డిజైన్. ఇంతకు ముందన్న డిజైన్ల కంటే భిన్నంగా ఐఫోన్ ఎస్‌ఈ4 రానుంది.
అలాగే, ఐఫోన్ 16కు కూడా భిన్నంగా కొన్ని మార్పులతో ఐఫోన్ ఎస్‌ఈ4 రానున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ ఎస్‌ఈల్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు ఉంటాయి. తక్కువ ధరకు వస్తాయి.. అలాగే, పవర్ ఫుల్ ఇంటర్నల్స్ ఉంటాయి.అలాగే, ఐఫోన్ 16లో స్పోర్టింగ్ ఫన్ కలర్స్ లాంటివే ఐఫోన్ ఎస్‌ఈలోనూ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐఫోన్ ఎస్‌ఈ4 ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో విడుదల కానుండడంతో యూజర్లు మరింత ఆసక్తి కనబర్చవచ్చు. 5జీ సపోర్ట్ చేసే విధంగా ఐఫోన్ ఎస్‌ఈ 4 విడుదల కానుంది.ఈ ఫీచర్ ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 అన్ని మోడళ్లలో ఉంది.
మార్కెట్లో ఉన్న ఐఫోన్ ఎస్‌ఈ 3 ధర భారత్‌లో రూ.47,600గా ఉంది.భారతదేశంలో ఇప్పుడు విడుదల కానున్నఐఫోన్ ఎస్‌ఈ4 ధర సుమారు రూ .50,000 ఉండొచ్చని భావిస్తున్నారు. ఐఫోన్ 16 మోడళ్లలో ఉన్న స్పోర్టింగ్ కలర్స్, ఆకర్షణీయమైన షేడ్స్ ఇప్పుడు ఐఫోన్ ఎస్‌ఈ 4లోనూ ఉండొచ్చు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష