ఫిబ్రవరి 20న బహ్రెయిన్ స్పోర్ట్స్ డే..హాఫ్-వర్కింగ్ డే..!!

- February 04, 2025 , by Maagulf
ఫిబ్రవరి 20న బహ్రెయిన్ స్పోర్ట్స్ డే..హాఫ్-వర్కింగ్ డే..!!

మనామా: రాబోయే బహ్రెయిన్ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 20న అన్ని మంత్రిత్వ శాఖలు,  ప్రభుత్వ ఏజెన్సీలకు హాఫ్ డే హాలీడే ప్రకటించారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులను వివిధ క్రీడా కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గుదైబియా ప్యాలెస్‌లో క్రౌన్ ప్రిన్స్,  ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన జరిగిన వీక్లీ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

బహ్రెయిన్ స్పోర్ట్స్ డే అనేది పౌరులు, నివాసితులలో ఫిట్‌నెస్ సంస్కృతిని పెంపొందించడానికి సంబంధించిన వార్షిక కార్యక్రమం. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, స్పోర్ట్స్ క్లబ్‌లు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తాయి.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com