భారీగా భారత రూపాయి పతనం..OMR 226 మార్క్..!!

- February 04, 2025 , by Maagulf
భారీగా భారత రూపాయి పతనం..OMR 226 మార్క్..!!

మస్కట్: భారత రూపాయి సోమవారం రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది. తొలిసారిగా అమెరికా డాలర్‌తో పోలిస్తే 87ను దాటింది.ఒమన్‌లోని ఎక్స్ఛేంజ్ హౌస్‌లు ఒక OMRకి 225.80 ఆఫర్ చేస్తున్నాయి. మస్కట్‌లోని మాజీ SBI ఆర్థిక నిపుణుడు R. మధుసూదనన్ మాట్లాడుతూ.. INR ఇంట్రా-డేలో 87.29 స్థాయిలను అధిగమించి 87.1850 వద్ద ముగిసిందన్నారు.రూపాయి పతనానికి కారణాలు చెబుతూ.. మెక్సికో, కెనడా, చైనాలపై అధిక సుంకాలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు విస్తృత వాణిజ్య యుద్ధ భయాలను ప్రేరేపించాయని పేర్కొన్నారు.దీని కారణంగా ఆసియా కరెన్సీలు కూడా బలహీనపడ్డాయని తెలిపారు. డాలర్ ఇండెక్స్ (DXY) 109.88కి పెరిగిందన్నారు.  భారత ఫారెక్స్ అవుట్‌ఫ్లోలు కొనసాగుతున్నాయి. ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. గ్లోబల్ ట్రేడ్‌లో అనిశ్చితికితోడు డాలర్ ఇండెక్స్ పెరుగుదల కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) భారతీయ స్టాక్ మార్కెట్ నుండి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. జనవరి 2025లోనే FIIలు 87వేల కోట్లకు పైగా విలువైన సెక్యూరిటీలను విక్రయించాయి. సెప్టెంబరు 2024లో భారతదేశ ఫారెక్స్ నిల్వ USD 700 బిలియన్లకు పైగా ఉండగా, అది ఇప్పుడు $ 624 బిలియన్లకు తగ్గింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com