భారీగా పెరిగిన బంగారం ధరలు

- February 04, 2025 , by Maagulf
భారీగా పెరిగిన బంగారం ధరలు

పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి.ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది.ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే.ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి చర్యల కారణంగానే ప్రస్తుతం అమెరికా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కొంతమంది నిపుణుల అంచనా వేస్తున్నారు.ఇదిలా ఉంటే డోనాల్డ్ ట్రంప్ ఇటీవల మెక్సికో కెనడా పైన ప్రకటించిన ఆంక్షలు కొరడాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ మెక్సికో కెనడా పట్ల కఠినంగానే ఉంటామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com