యూఏఈలో నివాసితులకు ఇష్టమైన యాప్ ఇదే..హయ్యేస్ట్ డౌన్ లోడ్స్..!!
- February 05, 2025
యూఏఈ: 2024లో యూఏఈ నివాసితుల దృష్టిని ఏ మొబైల్ అప్లికేషన్‌లు ఎక్కువగా ఆకర్షించాయో కొత్తగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో TikTok అగ్రస్థానంలో ఉంది. సెన్సార్ టవర్ స్టేట్ ఆఫ్ మొబైల్ 2025 నివేదిక ప్రకారం.. యూఏఈలో TikTok అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ అని, నివాసితులు రోజుకు సగటున 2 గంటలు దీనిని ఉపయోగిస్తున్నారు. యూఏఈలో 11.2 మిలియన్ల నివాసితులు 2024లో చైనీస్ యాజమాన్యంలోని యాప్‌లో 7.63 బిలియన్ గంటలు గడిపారని డేటా తెలిపింది. వీకెండ్లలో టిక్‌టాక్‌లో నాలుగు గంటలు నుండి 6 గంటలపాటు స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతారట. అమెరికన్ పౌరుల డేటాపై గూఢచర్యం గురించి ఆందోళనల కారణంగా టిక్‌టాక్ ఇటీవల అమెరికాలో నిషేధించాలనే చట్టం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.
ఇక దుబాయ్‌కి చెందిన టెలిగ్రామ్ యూఏఈలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌గా ఉంది. ఎందుకంటే నివాసితులు రోజుకు సగటున గంటసేపు దీన్ని ఉపయోగిస్తున్నారని నివేదిక తెలిపింది. దేశంలోని ఇతర ప్రసిద్ధ యాప్‌లలో WhatsApp Business, MX Player, Phone by Google, Google Maps, PLAYit , Gmail ఉన్నాయి. నివాసితులు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా యాప్‌లు, ప్లాట్‌ఫారమ్‌లలో గడిపారు. తర్వాత AI చాట్‌బాట్‌లు, సాఫ్ట్‌వేర్, ఇతర యుటిలిటీలు, మీడియా, వినోదం, షాపింగ్ కోసం బ్రౌజింగ్ చేశారని తెలిపింది.
టాప్ డౌన్‌లోడ్ చేసిన యాప్‌లు
సోషల్ మీడియా యాప్‌లలో టిక్ టాక్ టాప్ లో ఉండగా, ఆ తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మెసెంజర్, టెలిగ్రామ్ తర్వాతి సంవత్సరం యూఏఈలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ టిక్ టాక్. మొత్తంమీద, VPN ప్రాక్సీ మాస్టర్ తర్వాత గత సంవత్సరం యూఏఈలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన రెండవ యాప్ గా టిక్ టాక్ నిలిచింది.
ఫైనాన్స్ యాప్‌లలో Buy-now-pay-alter యాప్ Tabby అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా ఉంది. తర్వాత డిజిటల్ వాలెట్ యాప్ Taptap Send, C3Pay, Mashreq Egypt, ADCB హయ్యక్, ADCB, e&, బీమా యాప్ ILOE, Binance, BNPL యాప్ Tamara. చైనీస్ ఇ-కామర్స్ యాప్ Temu.. సరసమైన ధరలకు లభ్యమయ్యే ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. Trendyol, Shein, Noon, Amazon గత సంవత్సరం షాపింగ్ కేటగిరీలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన టాప్ 5 యాప్‌లలోకి వచ్చాయి.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్‌లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్‌లో హిందూ మహాసముద్ర సదస్సు..!!