సూర్యప్రభ వాహనం పై దేవదేవుని కటాక్షం

- February 05, 2025 , by Maagulf
సూర్యప్రభ వాహనం పై దేవదేవుని కటాక్షం

తిరుమల: తిరుమల క్షేత్రంలో సూర్య జయంతి వేడుక వైభవంగా ముగిసింది రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమినాడు జరిగే ఈ ఉత్సవం తిరుమలలో ప్రత్యేకమైన వేడుకగా గుర్తించబడింది.ఈ ఏడాది, టిటిడి ఈ ఉత్సవాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ఈ వేడుకల్లో శ్రీమలయప్ప స్వామి 7 వాహన సేవలను అందుకున్నారు. తిరుమలలో రథసప్తమి 1564 నుండి జరుగుతోంది ఈ పర్వదినం సందర్భంగా సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాల్లో స్వామివారి దక్షిణాన్ని భక్తులు అనుభవించారు.

ఫిబ్రవరి 4న జరిగిన ఈ రథసప్తమి సందర్భంలో స్వామివారికి ఉదయం తోమాల, కొలువు, సహస్రనామార్చన నిర్వహించారు. తర్వాత సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగి భక్తులకు అనుగ్రహించారు. ఈ రోజు బ్రహ్మోత్సవంగా పరిగణించబడిన రథసప్తమి ఉత్సవం టీటీడీ విజయవంతంగా నిర్వహించింది. గత 460 ఏళ్లుగా ఈ వేడుక తిరుమలలో జరుగుతోంది. సూర్యప్రభ వాహనంతో రథసప్తమి ప్రారంభం కాగా ఉదయం 5:30 నుండి 8:00 గంటల వరకు ఉత్సవం వైభవంగా కొనసాగింది. ఉదయం 6:48 గంటలకు, సూర్యుడు తన సౌమ్య కాంతులతో శ్రీమలయప్ప స్వామి పాదాలపై ప్రసరించి భక్తులకు ఆత్మానందాన్ని ఇచ్చారు.

ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. సూర్యుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాతగా భావించి భక్తులు సూర్యప్రభ వాహన సేవను ఆస్వాదించారు. ఈ వాహనంలో భాగంగా భక్తులు సూర్యుడి ద్వారా బాగ్యాలూ ఆయురారోగ్యాలూ పొందుతారని నమ్ముతారు రథసప్తమి లో మూడవ వాహనం గరుడ వాహనసేవ కూడా ఘనంగా జరిగింది. ఉదయం 11 నుండి 12 గంటల వరకు సాగిన ఈ సేవలో భక్తులు గరుడ వాహనంపై స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు.

గరుడ వాహనం పాపప్రాయశ్చిత్తం కోసం శ్రద్ధగా భావించే వాహనంగా ఉన్నది.టీటీడీ బాలమందిరం విద్యార్థులు ఈ సూర్యప్రభ వాహనసేవలో శ్లోకాలు ఆలపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అలాగే వివిధ కళా బృందాలు తమ ప్రదర్శనలతో భక్తులను అలరించాయి. సూర్యదేవుని వేషధారణలు దశావతారాలు భక్తుల హృదయాలను స్వీకరించాయి ఈ రథసప్తమి ఉత్సవం తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన వేడుకగా మిగిలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com