దమ్మామ్‌లో 11 మిలియన్లకు పైగా డ్రగ్ పిల్స్..ఇద్దరు అరెస్ట్..
- February 06, 2025
రియాద్: తూర్పు ప్రావిన్స్‌లోని దమ్మామ్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్ట్ వద్ద 11 మిలియన్లకు పైగా డ్రగ్స్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ విఫలం చేసింది.ఈ కేసులో ఒక సౌదీ పౌరుడితోపాటు జోర్డాన్ నివాసిని అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ ప్రకారం.. ఓడరేవుకు చేరుకున్న ఆహార సామాగ్రి రవాణాలో మొత్తం 11,108,998 యాంఫెటమైన్ మాత్రలు దాచి పెట్టినట్టు తనిఖీల సందర్భంగా గుర్తించారు. డైరెక్టరేట్ జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ సహకారంతో చేపట్టిన భద్రతా ఆపరేషన్‌లో డ్రగ్స్‌ను, దానిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో 911 మరియు సౌదీలోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా ట్రాఫికింగ్‌కు సంబంధించిన ఏదైనా కార్యకలాపాల సమాచారాన్ని తెలియజేయాలని భద్రతా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







