4 కొత్త ప్రదేశాలలో షార్జా లైట్ ఫెస్టివల్ రిటర్న్స్..!!
- February 07, 2025
యూఏఈ: షార్జా లైట్ ఫెస్టివల్ తిరిగొచ్చింది. ఫిబ్రవరి 23 వరకు షార్జా అంతటా ల్యాండ్‌మార్క్‌లు అద్భుతమైన లైట్ డిస్‌ప్లేలతో వెలిగిపోనున్నాయి. ఈ సంవత్సరం ఎమిరేట్‌లో నాలుగు కొత్త ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. ఇది సందర్శకులను ఆకర్షించడమే కాకుండా 12 ప్రదేశాలలో చిన్న వ్యాపారాలకు విలువైన వేదికను అందిస్తుందని ఒక ఉన్నత అధికారి తెలిపారు. గత సంవత్సరం, ఈ ఫెస్టివల్ ను 100,000 మంది సందర్శకులు సందర్శించారు. యూనివర్శిటీ సిటీ హాల్ ఎదురుగా ఉన్న లైట్ విలేజ్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి తెరిచి ఉంటుంది. ఆదివారం నుండి బుధవారం వరకు అర్ధరాత్రి మూసివేయబడుతుందని, ఇది వారాంతాల్లో ఉదయం 1 గంటల వరకు తెరిచి ఉంటుంది.
SMEలకు మద్దతు
షార్జా కామర్స్ అండ్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఖలీద్ అల్ మిద్ఫా మాట్లాడుతూ.. లైట్ విలేజ్ ఎస్‌ఎల్‌ఎఫ్‌లో చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది ఫెస్టివల్ సమయంలో ఎక్స్‌పోజర్ ఇవ్వడం ద్వారా SMEలకు మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ ఏడాది 300 దరఖాస్తుల్లో దాదాపు 60 SMEలను ఎంపిక చేసినట్లు అల్ మిద్ఫా తెలిపారు. దేశాన్ని ప్రధాన ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మార్చే యూఏఈ మొత్తం పర్యాటక లక్ష్యాలకు కూడా ఇది సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







